S Thaman: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది తెలుసుకుని ముందడుగు వేస్తే అద్భుతాలు జరుగుతాయి. సోషల్ మీడియాలో చాలా మంది తమ టాలెంట్ తో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. కొంత మంది టాలెంట్ చూస్తే మతిపోతుంది. ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఓ అంధ యువకుడు పాడిన పాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అతడి స్వరం అందరి మనసులను కట్టిపడేస్తోంది.
ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు . ‘రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ’ సాంగ్‌ను ఆర్టీసీ బస్సులో కళ్లు లేని ఆ యువకుడు అద్భుతంగా ఆలపించాడు. ఆ వీడియోను ఎవరో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా.. దానిని ఆయన రీపోస్ట్ చేశారు. ఆ యువకుడి టాలెంట్‌కు సజ్జనార్ ముగ్ధుడైపోయాడు. ఆయన ఆ వీడియోను పోస్ట్ చేసి.. పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని పేర్కొన్నారు. సజ్జనార్ చేసిన పోస్ట్ చాలా మంది లైక్ చేశారు. ఎవరైనా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.
తాజాగా ఆ యువకుడిని ఉద్దేశించి సంగీత దర్శకుడు ఎస్ తమన్ పోస్ట్ట్ చేశారు. అతడు ఖచ్చితంగా ఇండియన్ ఐడల్ లో పాడతాడని.. తమన్ హామీ ఇచ్చారు. ఆ అబ్బాయి ఖచ్చితంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాడుతాడని అన్నారు. అతడి గొప్ప టాలెంట్ ఉందని.. అతనితో కలిసి నేను కూడా పాడతానని తమన్ పోస్ట్ లో పేర్కొన్నారు. టాలెంట్ గుర్తించిన అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా అంటూ తమన్ పోస్ట్ చేశాడు.