Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారం కేసులో బాధితురాలిపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యూలేట్ చేస్తున్న వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. గూగుల్, యూట్యూబ్, మెటాకి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఛానల్స్ బ్లాక్ లిస్ట్ చేసే పనిలో సైబర్ టీమ్ పడింది. దాసరి విజ్ఞాన్ , కరాటే కళ్యాణి , శేఖర్ బాషా , మహీధర్ వైబ్స్ పై సెక్షన్ 72 BNS , 356 (1) BNS 67 of IT Act 2008 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞాన్‌పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. చీటింగ్, దొంగతనం, ఫుడ్ బిజినెస్ పేరుతో 4 లక్షల మోసం చేసినట్లు.. సినిమా తీస్తాను అని చెప్పి కెమెరాలు దొంగతనం చేసిన కేసులు ఉన్నట్లు గుర్తించారు.
అత్యాచారం కేసు నమోదైన నాటి నుంచి యూట్యూబర్ హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగ్ సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. హర్షసాయి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.