Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తల తాకట్టుపెట్టి అయినా రైతాంగానికి తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రడ్డి అన్నారని.. సీఎం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం పరిస్థితి బాగా లేకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులు పంటలు పండిస్తున్నారని అన్నారు.