GHMC: ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్‌కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్‌లో ఐటీ విభాగం క్యాప్చర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌ను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024 నుండి అమలు చేస్తున్నారు. పారదర్శక, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదుకు తోడ్పడుతుందని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయాలతో సహా నమోదవ్వనుంది.
కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలతో రెండు గేట్ల ప్రవేశ ద్వారాల వద్ద క్యాప్చుర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేశారు. అమర్చిన కెమెరా లో ఫోటో క్యాప్చర్ చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ అటెండెన్స్ సమయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేశారు.