Home » Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. దీపం పథకం ఈ దీపావళి పండుగతో ఇళ్లల్లో వెలుగులు తెస్తుందన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ఈ నెల 31 తేదీన దీపావళి పథకం ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని.. 31వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని అధికారులకు సూచించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం అమల్లోకి వచ్చిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876లు కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25ల సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఉచిత సిలిండర్ల పథకంతో ప్రభుత్వంపై రూ. 2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఐదేళ్ళకు కలిపి 13వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *