MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ ఆరోపించారు.
గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసన్నారు. జన్వాడ పామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అంటూ వ్యాఖ్యానించారు. ఒక సారి దీపావళి పెస్టివల్,ఇంకో సారి గృహ ప్రవేశం అంటున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదన్నారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడన్నారు. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడని అన్నారు. ఇప్పుడు స్టేట్మెంట్ ను మారుస్తున్నారని అన్నారు. పామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముందంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.