Home » Suryapet:జిల్లాలో జరిగిన వరద నష్టం పై ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Suryapet:జిల్లాలో జరిగిన వరద నష్టం పై ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

District Flood Damage Photo Exhibition

ఖమ్మం జిల్లా పాలేరు లో వరద నష్టం పై రైతులతో సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, హోమ్ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గార్లకు మోతే మండలం సింగరేణిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్వాగతం పలికారు. అక్కడ నుండి రోడ్డు మార్గన పాలేరు లోని జవహర్ నవోదయ పాఠశాల ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు.


అక్కడ ఏర్పాటు చేసిన ఛాయ చిత్ర ప్రదర్శన ద్వారా సూర్యపెట జిల్లాలో వరద వల్ల జిల్లాలో ఇద్దరు మరణించారని వారికి 5 లక్షల చొప్పున చెక్ లను అందజేశామని ,కూలిన, దెబ్బతిన్న ఇండ్ల గురించి,తెగిన కాల్వ కట్టలు, చెరువులు, రోడ్లు, వరదలో మునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న కరెంట్ స్తంబాలు, ట్రాన్సపార్మర్స్ మొదలగు వాటి గురించి అలాగే జిల్లాలో భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉండటం టో ముందుగానే అప్రమత్తత అయి జిల్లాలోని అధికారులు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరిలించినామని అక్కడ వారికి భోజన సదుపాయం కల్పించామని వరద తగ్గిన తర్వాత హౌజ్ టు హౌజ్ సర్వే చేసి ప్రజలకు ఎవెరెవరికి ఎంత నష్టం జరిగిందో క్షేత్ర స్థాయి లో సర్వే చేయటం జరిగిందని వారికి త్వరలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందిస్తామని, వరద ముప్పు నుండి బయట పడిన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ నిరంతరం చేస్తున్నామాని,వరదతో నిరాశ్రాయులైన ప్రజలకు ఇప్పటికి భోజనం ఏర్పాటు చేస్తూన్నామని, నిత్యావసర సరుకులు అందజేశామని, పున్నరుద్దరణ పనులు వేగవంతంగా చేపట్టామని జిల్లా కలెక్టర్ కేంద్ర రాష్ట్ర మంత్రులకు వివరించారు. ప్రజాప్రతినిదులు,ఆధికారులు పాల్గొన్నారు.

More Related News:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *