Home » CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: KCR కి మళ్లీ అవకాశం లేదని సవాల్

CM Revanth Reddy: వరంగల్ సభలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్‌..ఓడిస్తానని చెప్పా ఓడించినా..పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా తెప్పిస్తా అన్న, గుండు సున్నాతో మిగిలిపోయినవు.. ఇప్పుడు చెబుతున్నా కేసీఆర్.. నిన్ను, నీపార్టీని తెలంగాణలో మొలక ఎత్తనియ్యనని ఓరుగల్లు గడ్డపై నిలబడి చెబుతున్నా… కేసీఆర్ ఇగా చూద్దాం.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతున్నారని.. పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారని సీఎం అన్నారు. అదానీ, అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారన్నారు. పది నెలల్లో ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also:

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు –

మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది
“రూ.500లకే ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ పొందారు. దేశంలో ఎక్కడైనా రూ.500.లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారా? దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారు.. కేసీఆర్… మీరు ఫామ్ హౌసులోనే ఉండండి… కావలసినవి అక్కడికే పంపిస్తా.. పదినెలల్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు తప్ప ఇంకేమీ కాలేదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఆనాడు భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని.. మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఈ వేదికగా మాట ఇస్తున్నా… మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. మాట ఇస్తే తల తెగిపడినా మడమ తిప్పని నైజం కాంగ్రెస్‌ది. కనీసం మీకు మమ్మల్ని అభినందించే మనసు లేదు కానీ.. శాపనార్ధాలు పెడుతుండ్రు..వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన వ్యక్తి కేసీఆర్..రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు. దేశంలో ఎక్కడా ఇంత వరకు ఏ రాష్ర్టంలో ఈ స్థాయిలో వరి ధాన్యం పండిచలేదు.. నీ దుఃఖం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. రా ప్రజల్లోకి… వచ్చి మాట్లాడు… నువ్ లేవనెత్తిన అంశాలు సహేతుకమైతే సరిచేసుకుంటాం. ఆయన రాడట కానీ ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం.. రాసి పెట్టుకోండి.. కేసీఆర్ కాస్కో చూద్దాం.. ఫామ్ హౌస్‌లో పడుకుంటే నీ గురించి తేడనుకోకు.. నాకు ముందు తెలుసు.. వెనక తెలుసు. మళ్లీ చెబుతున్నా…. రా బయటకు..” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also:

Rana Talk Show & Nayantara Doc: OTT Releases Nov 2024

ఇవాళ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితమంటూ సీఎం అన్నారు. ఈ అడబిడ్డలు మనసు నిండుగా నన్ను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నామన్నారు. ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించామని చెప్పారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేసింది మన ఆడబిడ్డనే అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారని.. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టాటా బిర్లాలను తలదన్నేల రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోందన్నారు. మేం నిర్మిస్తే మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన మాట్లాడుతున్నారని.. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లుగా పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడిందన్నారు. మీరు పూర్తిచేయలేదు కాబట్టే.. మేం కాళోజీ కళాక్షేత్రంను పూర్తి చేశామన్నారు. వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయన్నారు. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామన్నారు. పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు.. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా తీర్చి దిద్దాలని నిర్ణయించామన్నారు. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు ఆరువేల కోట్లు కేటాయించించామన్నారు. వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లేనన్నారు. వరంగల్‌ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదన్నారు. మీరు కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు.. మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తామన్నారు.

Read Also:

కిషన్ రెడ్డికి సీఎం కౌంటర్
కేటీఆర్ మాట్లాడగానే రెండోరోజు కిషన్ రెడ్డి మాట్లాడుతారని సీఎం రేవంత్ విమర్శించారు. సోనియమ్మకు గులాం అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని.. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తల్లి సోనియమ్మ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోనియమ్మ మా అమ్మ.. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ అంటూ పేర్కొన్నారు. అలాంటి ఆ తల్లి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా మేం సిద్ధమన్నారు. ఇది మాకు అవమానం కాదు.. ఆత్మ గౌరవమన్నారు. ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదన్నారు. కిషన్ రెడ్డి సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే.. మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుందన్నారు. తెలంగాణను అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ అని విమర్శించారు. ఆయనకు గులాంగా మారిన నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు.. ఆ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు.. మోదీకి కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *