Home » Politics » Page 2

Perni Nani: ఇదేమన్నా రాష్ట్ర సమస్యా.. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర

Perni Nani: జగన్‌ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక…

Read More

CM Chandrababu: సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేపట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్…

Read More

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యుడిగా చెవిటి వెంకన్న నియామకం.. తీవ్ర అసంతృప్తిలో అభిమానులు

Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, కె.వి. నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీని సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా కోదండ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. సూర్యాపేట జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న…

Read More

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. రెండేళ్ల క్రితం నాటి వాలంటీర్ హత్య కేసులో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేసాడనే కారణంగానే శ్రీకాంత్ కిరాయి మూకలతో హత్య చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ…

Read More

S Jaishankar Pakistan Visit: పాక్ గడ్డపై జైశంకర్ ప్రసంగం.. భయపడి లైవ్ ను నిలిపేసిన ఆ దేశ మీడియా!

S Jaishankar Pakistan Visit: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు పాక్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్‌లను బట్టబయలు చేశారు. ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. పాకిస్తాన్-చైనా CPEC ప్రాజెక్ట్ కారణంగా భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిన అంశాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లేవనెత్తారు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారం ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అన్ని దేశాలు…

Read More

Jammu Kashmir: ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు కానీ అంత ఈజీ కాదు.. జమ్మూకశ్మీర్ లో పవర్ గేమ్ ఇలా..

Jammu Kashmir: 2019 ఆగస్టులో కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్మూ కాశ్మీర్‌కు ఐదేళ్ల తర్వాత తొలి ముఖ్యమంత్రి పదవి దక్కింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కానున్నారు. ఆయన బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు సకీనా ఇట్టు, జావేద్ దార్, సురీందర్ చౌదరి, జావేద్ రాణా కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఛంబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయిన…

Read More

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్‌కు పదేళ్ల తర్వాత ఒమర్ అబ్దుల్లా రూపంలో కొత్త ముఖ్యమంత్రి లభించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అబ్దుల్లా మంత్రివర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లతో సహా ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రముఖులు అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

Read More

Nayab Singh Saini: అక్టోబర్ 17న హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణం.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Nayab Singh Saini: హర్యానా తదుపరి ముఖ్యమంత్రిగా నైబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా బీజేపీ సీనియర్ నాయకులంతా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. సైనీ ప్రమాణ స్వీకారం దసరా గ్రౌండ్ సెక్టార్ 5 పంచకులలో జరుగుతుంది. దీనికి సమయం 10 గంటలకు నిర్ణయించారు. కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్…

Read More

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం..

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతులకు మేలు చేకూర్చుతామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని, ఫలితంగా నీళ్లు వృధా అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంతమాగలూరు మండలం, అడవిపాలెం గ్రామం నుంచి 35 కి.మీ. మేర ప్రవహిస్తూ, దాదాపు లక్షా 80 వేల ఎకరాలకు నీళ్లు అందించే అద్దంకి బ్రాంచ్…

Read More

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని…..

Read More

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం..

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు….

Read More

Konda Surekha: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆరే.. అంటూ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కేటీఆర్ పై ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. “నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్ కు…

Read More

Akkineni Nagarjuna: చైతూ-సమంతను విడదీసింది కేటీఆరే.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న నాగార్జున

Akkineni Nagarjuna: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆరే.. అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఘాటుగా స్పందించారు. ‘కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. దయచేసి సాటి…

Read More

One Nation-One Election: 2029లో ఒక దేశం-ఒకే ఎన్నికలు జరిగితే రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?

One Nation-One Election: బుధవారం (సెప్టెంబర్ 18) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను కేబినెట్ ముందు ఉంచగా, దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చిలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను సమర్పించింది. ఈ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క 100 రోజుల ఎజెండాలో…

Read More

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఆయన పిటిషన్‌లో సవాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23న సుప్రీంకోర్టు అనుమతినిస్తూ, కేజ్రీవాల్‌కు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. జ్రీవాల్‌…

Read More