Home » Hyderabad

Anchor Sravanti: 40 రోజుల నుంచి నరకయాతన.. స్టార్ యాంకర్ పోస్ట్ వైరల్..!

Anchor Sravanti: చాలా మంది సెలబ్రెటీలకు ఏంటి కోట్లలో ఆదాయం వస్తుందని అనుకుంటారు. కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుందని చాలా మందికి తెలియదు. కొంత మంది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తుంటారు. అలా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యాంక‌ర్ స్రవంతి చొక్కారపు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో గత 40 రోజులుగా ఆస్పత్రిలో…

Read More

S Thaman: అతడు ఖచ్చితంగా ఇండియన్ ఐడల్ లో పాడతాడు.. అంధ యువకుడిని ఉద్దేశించి తమన్ పోస్ట్

S Thaman: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది తెలుసుకుని ముందడుగు వేస్తే అద్భుతాలు జరుగుతాయి. సోషల్ మీడియాలో చాలా మంది తమ టాలెంట్ తో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. కొంత మంది టాలెంట్ చూస్తే మతిపోతుంది. ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఓ అంధ యువకుడు పాడిన పాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అతడి స్వరం అందరి మనసులను కట్టిపడేస్తోంది. ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు….

Read More

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి, దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు విశాల్‌ తోపాటు గ్రామం లో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గా తేలిందని వెల్లడించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ది కీలక పాత్ర గా తేలిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు….

Read More

TGSRTC MD: కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు.. వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TGSRTC MD VC Sajjanar: ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు . ‘రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ’ సాంగ్‌ను ఆర్టీసీ బస్సులో కళ్లు లేని ఆ యువకుడు అద్భుతంగా ఆలపించాడు. ఆ వీడియోను ఎవరో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా…..

Read More

Holidays 2025: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం..

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫిబ్రవరి 2025లో ఒక ముఖ్యమైన మినహాయింపు మినహా అన్ని ఆదివారాలు, రెండవ శనివారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవు దినాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారాలు, రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి రెండవ శనివారం పని దినంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది….

Read More

Komireddy Jyothi: మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి మృతి..

Komireddy Jyothi: మెట్ పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు సతీమణి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో ఈ రోజు బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు. కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణ వార్త తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన…

Read More

Manikonda: మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Manikonda: హైదరాబాద్ లోని మణికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని…

Read More

Kethineni Digitals: “కేతినేని డిజిటల్స్”ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kethineni Digitals: డిజిటల్ రంగంలో సరికొత్త ఒరవడి ప్రారంభమైంది. మినీ థియేటర్(11.2), ఎల్ఈడి స్క్రీన్స్, ఎల్ఈడి స్టాండీస్, మినీ కాన్ఫరెన్స్ హాల్ ,వంటి ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ కేతినేని స్టూడియోస్ నేడు ప్రారంభమైంది. అమీర్ పేట లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఎదురుగా కేతినేని డిజిటల్స్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ, డైరెక్టర్ yvs చౌదరి, కె.లక్ష్మణ్,కేతినేని డిజిటల్…

Read More

Bunny Vasu: కిరణ్‌ అబ్బవరం సినిమాను వదల్లేదు.. అందుకే ఈ రోజు గెలిచాడు..

Bunny Vasu: కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘క’. తన్వీరామ్‌, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ ‘క’ టీమ్‌ను అభినందించారు. ఆయన…

Read More

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బ‌ర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి…..

Read More

Caste Census: నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో…

Read More

Minister Ponguleti: డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. మరో వైపు సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల గడువు ఉందని.. అప్పటివరకు కూడా మా ముఖ్యమంత్రిగా…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ ఆరోపించారు. గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని…

Read More

Pushpa 2 Prerelease: నగరంలో 144 సెక్షన్.. పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లేనట్టేనా?

Pushpa 2 Prerelease: హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. నెల రోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఐదుగురికి మించి గుడికూడితే చర్యలు ఉంటాయని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే…

Read More

Chiranjeevi: చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్

Chiranjeevi: హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతుల మీదుగా అక్కినేని జాతీయ అవార్డును ప్రదానం చేశారు. 2024 సంవత్సరానికి గానూ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు వరించింది. ఈ విషయాన్ని శతజయంతి రోజున అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ…

Read More

Samyukhtha Menon: బాలయ్య హాస్పిటల్ లో సంయుక్త మీనన్.. ఎందుకోసమంటే?

Samyukhtha Menon: వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న హీరోయిన్ సంయుక్త సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి మనసులు గెల్చుకుంటోంది. బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో సంయుక్త మీనన్ పాల్గొంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంయుక్త పేర్కొంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. పలువురు బసవతారకం ఆస్పత్రి వైద్యులతో కలిసి సంయుక్త…

Read More

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై స్పందించిన కేటీఆర్

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళి పండుగకు దావత్ చేసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదని.. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తోందని తెలిపారు. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇలాంటి కుట్రలకు మేము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు…

Read More

KTR: ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ.. చిక్కుల్లో కేటీఆర్ !

Raj Pakala: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. జన్వాడ కాలనీలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో…

Read More

TG DSC 2024: కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా

TG DSC 2024: తెలంగాణలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. ఇటీవల డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మందికి పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ అధికారులు…

Read More

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్.. యథావిధిగా పరీక్షలు

TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకి తొలగిపోయింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన సమాధానాలు ఇవ్వలేదని.. ఆ ప్రశ్నలకు మార్కులు…

Read More

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

Gold Rate Today: బంగారం కొనాలకునేవారికి గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు అక్టోబర్ 15, మంగళవారం, బంగారం ధర వరుసగా రెండవ రోజు తగ్గింది. ఈ రోజు బంగారం ధర రూ.270 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,610గా ఉంది. ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం…

Read More

Dussehra 2024: నేడు విజయదశమి.. రావణ దహనం, పూజా సమయం, విధానాన్ని తెలుసుకోండి..

Dussehra 2024: ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ మతం విశ్వాసాల ప్రకారం, రాముడు రావణుడిని చంపడం ద్వారా తల్లి సీతను లంక నుండి విడిపించాడు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లంకాపతి రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 12న అంటే ఈరోజు…

Read More

Saddula Bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటో తెలుసా? .. ఈ రోజు ప్రసాదం ఎంతో ప్రత్యేకం..

Saddula Bathukamma 2024: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ పూల పండగ బతుకమ్మను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామాలతో పాటు, పట్టణాల్లో కూడా జరుపుకునే పూల పండగ ఈ బతుకమ్మ. నేడు సద్దుల బతుకమ్మ, నేటితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. తీరొక్క పూలతో 9 రోజులు బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ.. పల్లెల్లో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఆడ బిడ్డలంతా.. ఆట పాటలతో జానపద గేయాలతో హుషారెత్తించే పండుగ బతుకమ్మ….

Read More

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం…

Read More

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని…..

Read More
GHMC Facial Recognition Attendance

GHMC-HYD: ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్‌కు జీహెచ్‌ఎంసీ శ్రీకారం

GHMC: ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్‌కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్‌లో ఐటీ విభాగం క్యాప్చర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌ను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024 నుండి అమలు…

Read More
Vinayaka Chevvathi

Vinayaka Chevvathi: Traffic Diversions in Hyderabad|హైదరాబాద్ ట్రాఫిక్ మార్గాల మళ్లింపు

వినాయక చవితి హైదరాబాద్ ట్రాఫిక్ మార్గాలు..Vinayaka Chevvathi Hyderabad Traffic Routes రేపటి నుంచి ఇటువైపు వెళ్తున్నారా?కొన్ని కొత్త చిక్కులు వచ్చినట్లే వినాయక చతుర్థి వచ్చేసింది. బడా గణేష్ హైదరాబాద్‌లో ఉన్నాడు. తొమ్మిది రోజుల పాటు వినాయక చతుర్థి వేడుకలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో వినాయక మండపాలను నిర్మించారు. ప్రధాన రహదారులపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా పోలీసులు…

Read More