Jani Master: అత్యాచార ఆరోపణలతో అరెస్టయి, బెయిల్ పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు.
అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. ఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న తీసుకోవాల్సిన అవార్డును కమిటీ రద్దు చేసింది. అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం నెలకొంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.