Home » Kaloji Birthday: కాళోజీ కలానికి.. ” బతుకంతా దేశానిది ” కళ నీరాజనం

Kaloji Birthday: కాళోజీ కలానికి.. ” బతుకంతా దేశానిది ” కళ నీరాజనం

Kaloji Birthday: కాళోజీ కలానికి.. " బతుకంతా దేశానిది " కళ నీరాజనం

కాళోజీ దిగి వచ్చాడా!.. ‘బతుకంతా దేశానిది’ ప్రదర్శన ఓ అద్భుతం

పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను తిలకించి.. కాళోజీ సేవలను స్మరించుకున్నారు.

కాళోజీ Birthday

Actors :
Shiva Ram Reddy( As Kaloji), Rishi, Ajay chandra, Sam, Lakshman, Anil, Mohan, Vincaa Rossa, Sai Deepika, Danish Aly, prathinav reddy, Srinivas, Vijay Ramakrishna, Siddhu, Surya, Prem kumar.
Technical Team:
Makeup : Malladi Gopala krishna
Lighting: BasavaRaju, Gnaneshwar Reddy
Music: Krishna veeranki, Sound Thulasi
Set: Tatikonda venkateshwarlu
Set Design: Surabhi Jayavardhan, Uma Shankar
Production manger: Hrudayini
Supervision: Varalakshmi. BS
Poster design: B. Annapurna
Publicity: Sam
Lyrics & Singer: Akella Chandramouli
Dance choreography: Srikanth Macharla
Assistant Dance choreography: Naresh
Writing Assistance: Rishi & Mohan
Play Synopsis: Sam
Written and Directed by G. Shivaram Reddy


ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన ” బతుకంతా దేశానిది” నాటకం ప్రేక్షకులను అలరించింది. జి. శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దకున్న ఈ నాటకం చూపరులను ఆద్యంతం కట్టిపడేసింది.

కాళోజీ

కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు కురిశాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్, లైటింగ్ అద్భుత అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు కరతాళ ధ్వనులు మోగాయి. ప్రశంసలు కురిశాయి.


ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకబృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ. TETA బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

More Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *