Baba Vanga Predictions: ప్రపంచంలో చాలా మంది గొప్ప ప్రవక్తలు దశాబ్దాల క్రితమే ఇటువంటి అంచనాలు వేశారు. అవి రాబోయే అనేక శతాబ్దాలుగా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ అంచనాలు చాలా నిజమయ్యాయి. అందువల్ల, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే సమయం వచ్చినప్పుడల్లా, ఈ అంచనాలు చర్చలోకి వస్తాయి. ఇప్పుడు ప్రపంచం 2024 సంవత్సరాంతానికి కదులుతోంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరం అంచనాలు చర్చలోకి వచ్చాయి.
బల్గేరియాకు చెందిన గొప్ప ప్రవక్త బాబా వంగా. బాబా వంగ అసలు పేరు.. వాంజెలియా పాండేవా గుష్టెరోవా. ఆమె 9/11 ఉగ్రదాడులు, 2022లో యూకేలో సంభవించిన వరదలను ముందుగానే పసిగట్టి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వెంగా గురించి ఇప్పటి వరకు అనేక అంచనాలు నిజమయ్యాయని అందరికీ తెలిసిందే. ఇందులో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, అమెరికాలో తీవ్రవాద సంస్థ అల్ ఖైదా 9/11 దాడులతో సహా అనేక అంచనాలు ఉన్నాయి. దీంతో పలు ఉపత్తులను, ముందుగానే పసిగట్టడంతో ఆమె మాటలకు, ఊహాగానాలకు బలం చేకూరాయి. 2025లో జరిగే ప్రపంచ సంఘటనల గురించి అంచనాలు వేశారు. వాటి గురించి వింటే నిద్ర కూడా పట్టదు. మరి అవేంటో తెలుసుకోండి.
ప్రపంచం అంతం ప్రారంభమవుతుంది..
2025 సంవత్సరం నుండి ప్రపంచ ప్రళయం ప్రారంభమవుతుందని, మానవాళి క్రమంగా అంతం అవుతుందని బాబా వెంగా చాలా దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. భూమి నుండి మానవ ఉనికి పూర్తిగా అదృశ్యం కావడానికి 5079 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచ ప్రళయం 2025లో మొదలవుతుందని, ఐరోపాలో తలెత్తే సంఘర్షణతో ఈ విధ్వంసం మొదలవుతుందని బాబా వంగా చెప్పారు. బాబా వెంగా అంచనా ప్రకారం, ఇటువంటి భయంకరమైన సంఘటనలు 2025 లో జరుగుతాయి, ఇది మానవాళిని అంతం వైపు నడిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, మరో ప్రవక్త నోస్ట్రాడమస్ కూడా 2025 సంవత్సరంలో ఐరోపాలో భయంకరమైన సంఘర్షణను అంచనా వేశారు. అటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ప్రవక్తల మాటలు నిజమైతే ప్రపంచం అంతం వైపు పయనిస్తుంది.
గ్రహాంతర వాసులతో పరిచయం
బాబా వంగా అంచనా ప్రకారం, వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ మార్పులు మొదలైన వాటి కారణంగా భూమిపై జీవించడం అసాధ్యం. దీని వల్ల 2130 సంవత్సరంలో మానవులకు గ్రహాంతర వాసులతో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు మానవులు తమ ఉనికిని కాపాడుకోవడానికి భూమి వెలుపల ఆశ్రయం పొందవలసి ఉంటుంది. దీని తరువాత, చివరకు 5079 సంవత్సరంలో భూమి నుండి ప్రతిదీ నాశనం చేయబడుతుంది.
2170 సంవత్సరం నాటికి భూమిపైనా వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, తద్వారా భూగ్రహం మొత్తం కరువు తాండవిస్తుందన్నారు. 3005 సంవత్సరంలో మానవులకు, గ్రహాంతర వాసులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని, వారితో యుద్ధానికి మానవులు అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పారు. 3797వ సంవత్సరం నాటికి భూమి మీద మానవులు ఉండరని, వారు వేరే గ్రహానికి వెళ్తారని చెప్పారు. భూమి మీద వాతావరణం నాశనం అవడంతో పాటు.. కరువు తాండవిస్తుండడంతో వారు వేరే గ్రహానికి వెళ్లక తప్పదన్నారు.5079వ సంవత్సరంలో ఈ యుగం ముగుస్తుందని, ఆ సంవత్సరంతో ప్రపంచం మొత్తం అంతం అవుతుందని, మానవ మనుగడే ఈ విశ్వంలో ఉండదని బాబా వంగా అంచనా వేశారు.
2028లో భూమి మీద ఉన్న వనరులు ముగిసే సమయం ఆసన్నమైందని గ్రహించిన మానవులు శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారని, అయితే ఆ గ్రహంపై వాతావరణం అనుకూలించకపోవడంతో అది జరగదని బాబా వంగా తలిపారు. 2033.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంవత్సరమని, ఈ సంవత్సరం.. ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లోని మంచు గడ్డలు కరిగి.. సముద్రంలో పడతాయని, తద్వారా సముద్రపు మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశముందన్నారు. 2076లో కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. 2130 నాటికి మనుషులు గ్రహాంతలవాసులతో పరిచయం పెంచుకోనున్నారని.. ఇది మానవ మనుగడను మరొక స్థాయికి తీసుకెళ్తుందన్నారు.