Anchor Sravanti: చాలా మంది సెలబ్రెటీలకు ఏంటి కోట్లలో ఆదాయం వస్తుందని అనుకుంటారు. కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుందని చాలా మందికి తెలియదు. కొంత మంది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తుంటారు. అలా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో గత 40 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నారు.
ఇందుకు సంబంధించి ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. నేను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదని చెప్పారు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ‘ఆడవారి కోసం’ ఈ పోస్ట్ అని వివరించారు. 40 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నట్లుగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఒకరోజు ఉదయం 6.45 గంటల నుంచి తర్వాతి రోజు తెల్లవారుజాము 2.45 గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్నట్లు చెపిపింది.
దీంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. 35 నుంచి 40 రోజులుగా నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతూనే ఉందని తెలిపింది. రకరకాల మెడిసిన్ వాడాను, వైద్యుడిని డైరెక్ట్‌గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ కూడా చేయించుకోలేదని ఫలితంగా ప్రాణాల మీదికి వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని.. ఆస్పత్రికి పరుగెత్తుకెళ్లాల్సి వచ్చిందని వివరించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఇది చిన్న సమస్య కాదని చెప్పారని తెలిపారు.
ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని.. ఆపరేషన్ కూడా చేశారని పేర్కొంది. తను కోలుకావాలంటే.. నెల రోజులకు పైగా పడుతుందని చెప్పారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకండి అని చెబుతున్నారు. షూటింగ్ లేదా మీ ఇతర పనుల కోసం అని ఎక్కువ సమయం కేటాయించకండని స్రవంతి తెలిపారు. అనారోగ్యంతో పనిలోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరగొచ్చని హెచ్చరించింది.