Home » Allu Arjun: అల్లు అర్జున్ కు ఊరట.. కేసును కొట్టేసిన హైకోర్టు

Allu Arjun: అల్లు అర్జున్ కు ఊరట.. కేసును కొట్టేసిన హైకోర్టు

Allu Arjun: అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలన సినీనటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఎఫ్ ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు కేసును కొట్టివేసింది.


ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్ పై ఫిర్యాదు నమోదైంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదైంది. కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కేసును కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *