Home » Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ రిప్లై!

Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ రిప్లై!

Samantha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెట్టారు. “విడాకులు నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరుతున్నా. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడొద్దు. ఓ మంత్రిగా మీ మాటలకు విలువుందని గ్రహిస్తారని ఆశిస్తున్నా. ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నా. మా విడాకులు పరస్పర అంగీకార ప్రకారమే జరిగాయి. మా విడాకుల విషయంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలను ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగ ఉండాలని కోరుకుంటున్నా.” అని సమంత పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగచైతన్య ఖండించారు. ఈ మేరకు తన తండ్రి నాగార్జున ట్వీట్ ను రీట్వీట్ చేశారు.


కొండా సురేఖ మాట్లాడుతూ.. “నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్ కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకొన్నారు. మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వారి లైఫ్ ను నాశనం చేశారు. అంతే కాకుండా గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్ ను చూసి చూడనట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో సమంత విడాకులు తీసుకుంది.” అని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *