Home » Raashi Khanna: బ్రేకప్ తో ఎంతో బాధపడ్డా.. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా..

Raashi Khanna: బ్రేకప్ తో ఎంతో బాధపడ్డా.. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా..

Raashi Khanna: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా వస్తున్న ‘ది సబర్మతీ రిపోర్ట్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పనుల్లో నటి రాశీఖన్నా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా కెరీర్, తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు.


గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు రాశీ ఖన్నా తెలిపారు. ఆ తర్వాత తనను తాను మార్చుకున్నానని చెప్పారు. స్ట్రాంగ్ గా నిలబడి కెరీర్ పై ఫోకస్ చేశానని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో కంటే తనకు బయటే ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తనకు అన్ని విధాలుగా సపోర్టు చేశారని వెల్లడించారు. వారే నా బలమంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు.


సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించానని.. అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆదరించారని చెప్పారు. నటిగా తెలుగులో తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ రిలీజ్ అయ్యాక తిరుపతి వెళ్లామని.. పెద్ద ఎత్తున జనాలు మమ్మల్ని చుట్టుముట్టారని రాశీ ఖన్నా తెలిపారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. మేనేజర్ ను అడిగితే తన కోసమ వారంతా వచ్చారని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అక్కడి జనాన్ని చూసి షాకయ్యానన్నారు. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోనన్నారు. అభిమానుల తోపులాట మేనేజర్, బౌన్సర్లు ఇబ్బంది పడ్డారన్నారు. ఫేమ్ గురించి అప్పటి వరకు తెలియదని.. ఆ తర్వాత దానిని అలవాటుగా మార్చుకున్నానన్నారు హీరోయిన్ రాశీ ఖన్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *