కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం
కేంద్ర ఉక్కు మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దురదృష్టవశాత్తు తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు మరణించారు. 91 ఏళ్ల వయసున్న ఆయన, హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.
భూపతిరాజు సూర్యనారాయణ రాజుకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పని చేసి పదవీ విరమణ చేశారు. వారి తండ్రి, భూపతిరాజు బాపిరాజు గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.
అంత్యక్రియలు:
భూపతిరాజు సూర్యనారాయణ రాజు భౌతిక కాయం రేపు ఉదయం భీమవరంలో వారి స్వగృహంలో దర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం ఒంటిగంటకు భీమవరం టూ టౌన్లో బలుసుమూడి మోక్షధానంలో అంత్యక్రియలు నిర్వహించబడతాయని, ఆయన కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.