Home » Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipaati Ravi Kumar: గ‌త వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణ‌యంతో తీసుకొచ్చిన జీవోల‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగం స‌ర్వ నాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి శాస‌న స‌భ‌లో మంగ‌ళ‌వారం గౌర‌వ స‌భ్యులు అడిగిన ప‌లు ప్రశ్నల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని… ఆక్వా రంగాన్ని, రైతుల‌ను ఏ విధంగా గ‌త వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేసింద‌నే విష‌యాల‌ను వివ‌రించారు. 2019 వ‌ర‌కు లాభాల‌బాట‌లో ఉన్న ఆక్వా రంగం గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో సంక్షోభంలోకి వెళ్లింద‌ని తెలిపారు. ఆక్వా ప‌రిశ్రమ అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఆక్వా జోన్ ల‌లో ఉన్న 10 ఎక‌రాల ఆక్వా రైతుల‌కు యూనిట్ కు రూ.1.50 రాయితీని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా… ఆక్వా రైతుల‌కు ఎటువంటి మార్కెట్ సెస్ లేద‌ని స్పష్టం చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్ల రేట్ల విష‌యంలోనూ ప‌రిశీల‌న‌…
ట్రాన్స్ ఫార్మర్ల రేట్లు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని స‌భ్యుల ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పిన మంత్రి గొట్టిపాటి.., రైతుల‌కు ఏ విధంగా లాభ‌సాటిగా అందించాలో… విద్యుత్ శాఖ ప‌రంగా ఆక్వా రైతుల‌కు ఎలా మేలు చేయాల‌నే దానిపైనే దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు వివ‌రించారు. అదే విధంగా 25 కేవీ, 65 కేవీ, 100 కేవీ ట్రాన్స్ ఫార్మర్ల రేట్లు ప‌క్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో కూడా ప‌రిశీల‌న చేస్తున్నామ‌న్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

70 శాతం ఆక్వా రైతుల‌కు మెండి చేయి….
రైతులను తికమకపెట్టే మూడు జీవోలను వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆక్వా రైతుల‌కు పూర్తి స్థాయిలో స‌బ్సిడీల‌ను అందించ‌డంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫ‌లం అయ్యిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని అందించామని తెలిపారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిబంధ‌న‌ల పేరుతో 70 శాతం మంది రైతుల‌కు స‌బ్సిడీలు తొల‌గించారని విమర్శించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే పేరుతో 10 ఎక‌రాలు, 5 ఎక‌రాలు అంటూ సాధ్యమైనంత వ‌ర‌కు ఆక్వా రైతుల‌కు స‌బ్సిడీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని సభలో వివరించారు. ఈ కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి పున‌ర్వైభ‌వం తీసుకు రావ‌డానికి కూట‌మి ప్రభుత్వం అన్ని ర‌కాల చ‌ర్యలు తీసుకుంటుంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు. ఐదేళ్లలో రూ.1.12 ల‌క్షల కోట్ల అప్పుల‌తో విద్యుత్ రంగ సంక్షోభం దిశగా వెళ్లి.. డిస్కంలు దివాళా తీసే స్థితికి వ‌చ్చాయ‌ని తెలిపారు. ఏదేమైనా ఆక్వా రైతుల‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంద‌ని వివ‌రించారు.

హేచ‌రీస్ స‌మ‌స్యల‌నూ ప‌రిష్కరిస్తాం….

శీతాకాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హేచ‌రీస్ ల‌లో వ‌చ్చే ఇబ్బందులను ఏ విధంగా అధిగ‌మించాలో కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. త్వర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హేచ‌రీస్ య‌జ‌మానుల‌తో విద్యుత్ శాఖ ప‌రంగా ఒక స‌మావేశం ఏర్పాటు చేసి వారికి న్యాయం జ‌రిగే విధంగా చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని స్పష్టం చేశారు. 2014లో అధికారం చేప‌ట్టిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆక్వారంగ అభివృద్ధికి చేసిన కృషిని మంత్రి గుర్తు చేశారు. గ‌డ‌చిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం త‌ప్పుడు నిర్ణయాల‌తో, మూడు అసంబద్ధ జీవోల‌తో ఆక్వా రంగం సంక్షోభంలోకి ప‌డింద‌న్నారు. అదే విధంగా గ‌త వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో రూ.1990 కోట్లు బాకీల‌తో డిస్క్ంల పై భారం వేసిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *