Home » Nayanthara Comments on Dhanush | ధనుష్ పై నయన్ వ్యాఖ్యలు

Nayanthara Comments on Dhanush | ధనుష్ పై నయన్ వ్యాఖ్యలు

Nayanthara Comments on Dhanush | ధనుష్ పై నయన్ వ్యాఖ్యలు

Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా తాను నటించిన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని పాటలను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ధనుష్‌కు బహిరంగ లేఖ రాసిన నయనతార, ఈ విషయంలో తాను ఎలాంటి న్యాయం పొందలేదని తెలిపారు.నయనతార తన లేఖలో ధనుష్‌ వైఖరిని సూటిగా విమర్శిస్తూ, ఆమె గతంలో ఆయనతో నటించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందని, ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల్లోకి తనను మరింత చేర్చగలిగినట్లు భావిస్తానని పేర్కొన్నారు.

తన కెరీర్‌లో కీలకమైన పాత్రల్లో ఒకటిగా భావించే ఈ చిత్రంలోని పాటలను తన డాక్యుమెంటరీలో ఉపయోగించాలని ఆశించిన నయనతార, ధనుష్ అనుమతి ఇవ్వకపోవడంతో చాలా బాధగా ఉంది అన్నారు.అంతేకాకుండా నయనతార తన లేఖలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయాలనుకోలేదని, కానీ ధనుష్ తీరును చూసి తాను నిస్సహాయతతో బాధపడుతున్నట్లు తెలిపారు. “ఈ డాక్యుమెంటరీ ద్వారా నా అభిమానులకు నేను ఎలాంటి అనుభూతిని పంచాలనుకున్నానో అది ఇప్పుడు సాధ్యపడడం లేదు. ఇది నాకు బాధను కలిగించే విషయం” అని ఆమె ఆ లేఖ లో చెప్పుకొచ్చారు. ఈ వివాదం తమిళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు నయనతార అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, ఇప్పటివరకు హీరో ధనుష్ దీనిపైనా ఎటువంటి జవాబు చెప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *