ollywood Singers: టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మరో సింగర్ రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ జంట పెళ్లి చేసుకున్నారు అని తెలియడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. వీరి వివాహం కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్కారని అభిమానులు అంటున్నారు. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్ సింగర్స్ కూడా ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం గమనార్హం. వీరిద్దరు కలిసి ఇస్టార్టు శంకర్‌లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.
అనురాగ్ కులకర్ణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన అనురాగ్.. తర్వాత వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ ప్రముఖ సింగర్‌గా మారాడు. అనురాగ్ కులకర్ణి కేరాఫ్ కంచెరపాలెం సినిమాలో ఆశపాశం సాంగ్, ఆర్‌ఎక్స్ 100 చిత్రంలోని పిల్లారా సాంగ్ ద్వారా పాపులర్ అయ్యాడు. శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ పాటతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. రమ్య బెహరా కూడా ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ప్రేక్షకుల మదిని గెలిచింది. ఆమె సూపర్ సింగర్‌లో పాల్గొంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి చిత్రాల్లో అనేక పాటలు పాడి రమ్య ప్రేక్షకులను మెప్పించింది. ఆమె గాత్రానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవలే వీరిద్దరు కలిసి హే రంగులే సాంగ్ ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ మిలియన్ వ్యూస్ రాబట్టింది.