IND vs SA: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన చివరి టీ-20 మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. ఓపెనర్ బ్యాటర్ సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు చేశారు. ఇద్దరూ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. జోహన్నెస్ బర్గ్ లో బౌండరీల వర్షం కురిపించారు. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్ లో మొత్తం 23 సిక్సులు, 17 ఫోర్లు బాదారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 36 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా ఎదుట 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
తిలక్ వర్మ 41 బంతుల్లో సెంచరీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 41 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియా తరఫున వరుసగా రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయడంలో తిలక్ వర్మ సంజూ శాంసన్‌ను సమం చేశాడు. ఇంతకు ముందు, సంజూ, శాంసన్‌లు టీమ్ ఇండియా తరఫున వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ఘనత కూడా సాధించారు. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో తిలక్ వర్మ కూడా 107 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ వర్మ అవుట్ అయిన తర్వాత, తిలక్ వర్మ మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు. మొదటి కొన్ని బంతులను జాగ్రత్తగా ఆడిన తర్వాత అతను తన గేర్ మార్చాడు. ఆ తర్వాత అతను ఆగే సూచనలు కనిపించలేదు. తిలక్ వర్మ మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లు బాది దక్షిణాఫ్రికా బౌలర్లను ధ్వంసం చేశాడు.