Home » Mrs India: మిసెస్ ఇండియా పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత

Mrs India: మిసెస్ ఇండియా పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత

Mrs India: మహిళలకు పెళ్లి అయ్యాక కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలంగాణ వనిత సుష్మా తోడేటి నిరూపించింది. మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో గతంలో సత్తా చాటిన సుష్మా తోడేటి తాజాగా మరో రికార్డు సాధించింది. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఆమె మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మ పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ కల్చర్ డ్రెస్, మిసెస్ వెల్ స్పోకెన్, సోషల్ ఇన్‌స్టిట్యూట్ వంటి విభాగాల్లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.


ఇటీవల UMB పేజెంట్ మిసెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులోనూ సుష్మా తోడేటి తన సత్తా చాటింది. ఈ పోటీల్లో సుష్మా తోడేటి మూడో రన్నరప్ గా నిలిచింది. తన భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో రాణించగలిగానని సుష్మా తోడేటి చెబుతోంది. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు. తెలంగాణ చేనేతను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడమే తన లక్ష్యమని సుష్మా తోడేటి చెప్పారు.


భారతదేశంలో యూఎంబీ అందాల పోటీలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన 70 మంది పోటీదారులు స్వాగతం పలికారు. నాలుగేళ్ల క్రితం ఉర్మి, స్నిగ్ధా బారుహ్ స్థాపించిన ఈ యూఎంబీ పోటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, మానుషి చిల్లర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, కరిష్మా కపూర్, మలైకా అరోరా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *