Sri Reddy: తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరు పీఎస్ లో టీడీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎస్ ఎన్, 67 ఐటీఏ 2000, 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పద్మ డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పోస్టులు కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు ముందు వైసీపీ సర్కారు అధికారంలో ఉండగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్టులు పెట్టారు.