Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు కాగా.. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎక్స్ వేదికగా ‘వ్యూహం’ సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి.. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఎస్సై శివరామయ్య నోటీసులు అందజేశారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తుళ్లూరులోనూ రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల ఫోటోలను ఆర్జీవీ గతంలో మార్ఫింగ్ చేసిన నెట్టింట అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.