Home » Goods Train Derailed In Peddapalli: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Goods Train Derailed In Peddapalli: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Goods Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods Train Derailed In Peddapalli:పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. మంగళవారం రాత్రి ఘజియాబాద్ నుండి ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్-కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు బోగీలు పట్టాలపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంది.
రద్దయిన రైళ్లు ఇవే..
*యశ్వంతపూర్-ముజఫర్‌పూర్

*కాచిగూడ-నాగర్‌సోల్

*కాచిగూడ కరీంనగర్

*కరీంనగర్-కాచిగూడ

*సికింద్రాబాద్- రామేశ్వరం

*రామేశ్వరం-సికింద్రాబాద్

*సికింద్రాబాద్-తిరుపతి

*తిరుపతి- సికింద్రాబాద్

*ఆదిలాబాద్- పర్లి

*పార్లీ-ఆదిలాబాద్

*అకోలా- పూర్ణ

*పూర్ణ-అకోలా

*ఆదిలాబాద్-నాందేడ్

*నాందేడ్-ఆదిలాబాద్

*నిజామాబాద్-కాచిగూడ

*కాచిగూడ-రాయచూర్

*రాయచూర్-కాచిగూడ

*గుంతకల్-బోధన్

*బోధన్-కాచిగూడ

*కాచిగూడ-గుంతకల్ రైళ్లు రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *