Satya Dev: టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలోకతి రానుంది. జీబ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.ఈ సందర్బంగా హీరో సత్య దేవ్ మాట్లాడుతూ.. అన్నయ్య(మెగాస్టార్ చిరంజీవి) ఎదురుగా ఉన్నప్పుడు నా నోట మాట రావడం లేదు. నాలుగు రోజులుగా చాలా ప్రిపేర్ అయ్యాను. కానీ ఆయన్ని చూసిన తర్వాత నాకు మాటలు రావడం లేదు. అన్నయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో మా సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందని నమ్మకం వచ్చేసింది. చిన్నప్పుడు అన్నయ్య సినిమాలు చూసే ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఒక శిఖరంపై జెండా పాతారు. నాలాంటి ఎంతోమందికి ఆ జెండాను చూస్తున్నప్పుడు ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ జెండాను చూసే శక్తి పుంజుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి. ప్రతి జనరేషన్ చిరంజీవి అనే పేరుని సెలబ్రేట్ చేసుకుంటుంది. అన్నయ్యని నేను వందసార్లు కలిసి ఉంటాను. మనకి స్క్రీన్ మీద కనిపించే దాని కంటే 100 టైమ్స్ గొప్ప వ్యక్తి ఆయన. ఆయనే దగ్గర్నుంచి చూసే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది.
ఇండియన్ సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన అన్నయ్యకి థాంక్యూ సో మచ్. గాడ్ ఫాదర్ అనే సినిమా బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. చిరంజీవి గారి సినిమాలో వీడు విలన్ ఏంటి? అని అందరూ నన్ను చూస్తున్న సమయంలో అన్నయ్య ఎంతో ప్రేమతో సెట్స్ లో ‘సత్యా మై బాయ్’ అని పిలిచేవారు. నిన్ను ఎవరూ నమ్మక్కర్లేదు నేను నమ్ముతున్నాను అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో చూడు అని చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక నా క్యారెక్టర్ గురించి అందరూ రాసినప్పుడు ఆయన ఫోన్ ‘చేసి నేను నీకు చెప్పానా’ అని అభినందించారు. చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను. అది నాకు చాలా అనిపించింది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు నన్ను పెట్టారనే నమ్మకంతోనే జీబ్రా నిర్మాతలు నాకు ఈ సినిమా ఇచ్చారు. ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. చాలా బిగ్ కాన్వాస్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి అన్నయ్య వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు డెబ్యు లాంటిది. ఇది అన్నయ్యకి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య చెప్పడం వల్లే గాడ్ ఫాదర్ లో క్యారెక్టర్ చేశాను. దాని వలనే నాకు ఈ సినిమా వచ్చింది. ఇకనుంచి ఒక కొత్త సత్యదేవ్ ని చూస్తారు. నా నుంచి బెస్ట్ ఫిలిమ్స్ వస్తాయి. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. నిర్మాతలు సపోర్ట్ ని మర్చిపోలేను. డైరెక్టర్ ఈ కథనే తీసుకొచ్చినందుకు తనకు రుణపడి ఉంటాను. ప్రశాంత్ కి థాంక్యూ. రవి గారికి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’చెప్పారు హీరో సత్యదేవ్.