Rebel Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా భారీ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లు అవుతోంది. 2022, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వరుస సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అభిమానులు అప్పుడే డిసైడ్ చేశారు. వారిని అంచనాలను మించేలా ప్రపంచ ఖ్యాతిని ప్రభాస్ దక్కించుకున్నారు.
ఈశ్వర్ సినిమా అనంతరం రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం సినిమాలతో ప్రేక్షకులకు ప్రభాస్ కనెక్ట్ కాగా.. తర్వాత ఛత్రపతి సినిమాతో అదరగొట్టేశాడు. అనంంతరం పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా సినిమాలతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి. ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి సినిమాలతో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా తెచ్చుకున్నాడు. మిర్చి వరకు ప్రభాస్ నట ప్రస్థానం ఒక ఎత్తు అయితే బాహుబలితో పాన్ ఇండియా ప్రయాణాన్ని ప్రారంభించాడు. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహా, సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. బాహుబలి-2, కల్కి 2898ఏడీ చిత్రాలతో ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడం రికార్డే. కలెక్షన్స్ తో పాటు బోలెడన్ని రికార్డులు ప్రభాస్ సొంతం. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాతో పాటు హోంబలెతో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి కాక లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా సినిమాలు చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా ఓకే చేసాడని సమాచారం. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ సంచలనాన్ని సృష్టించబోతున్నాయి.