Home » Producer Dil Raju: కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ లాంచ్

Producer Dil Raju: కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ లాంచ్

Producer Dil Raju: కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు.


కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చన్నారు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నామని వెల్లడించారు. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుందన్నారు. వారంలో ఒక రోజు నేను ఈ టీం తెచ్చిన స్క్రిప్ట్‌లను వింటానన్నారు.


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ” నా బర్త్ డే సందర్భంగా అయినా లేదా న్యూయర్ సందర్భంగా అయినా ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. నాకు సన్నిహితులైన స్టార్ హీరోలను, దర్శకులందరినీ పిలిచి ఆ వెబ్ సైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. దీనిపై త్వరలోనే అప్డేట్ ఇస్తాం.ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులను చేస్తున్నారు. ఈ సంస్థ కార్పోరేట్ స్టైల్లో ఉంటుంది. ఇందులో పని చేసే వారందరికీ జీతాలు ఇస్తాం. కొత్త వాళ్లందరికీ ఇదొక ఫ్లాట్ ఫాంగా ఉండాలని అనుకుంటున్నాను. రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా స్క్రిప్టులను రివ్యూ చేయొచ్చు. స్క్రిప్ట్ స్థాయిలోనే మీడియా వాళ్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నాం. సినిమాను ఎలాగూ రివ్యూ చేస్తారు. దాని కంటే ముందు ఇలా స్క్రిప్ట్‌ని కూడా రివ్యూ చేసేందుకు మా టీంలోకి మీడియాని ఆహ్వానిస్తున్నాం.” అని దిల్ రాజు అన్నారు.

“ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. నా దగ్గరకు చాలా మంది వచ్చి పోస్టర్‌లు, టీజర్‌లు రిలీజ్ చేయమని అడుగుతారు. అవి చూడగానే నాకు అర్థం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఎందుకు తీస్తారు.. ఎవరు చూస్తారు? అని చెప్పేస్తాను. అక్కడ ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను. ఏడాదికి నాలుగైదు సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాం. మా టీం అన్ని కథలు, స్క్రిప్టు‌లు విని వడపోస్తారు. అందులోంచి కేవలం ఐదు చిత్రాలను ఎంచుకుంటాం. కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలనే కండీషన్ పెట్టాను. తీసే ఐదు చిత్రాలకు ఐదు చిత్రాలు ఫ్లాప్ అయితే మా కష్టం వృథా అవుతుంది. ఈ ప్రాసెస్‌లో న్యూ టాలెంట్ వస్తే.. మున్ముందు నా బ్యానర్‌లోనే సినిమా చేసే అవకాశం ఉంటుంది. అసలు టాలెంట్ ముందు తెరపైకి రావాలి. బలగం వేణు మాకు సినిమా చేశాడు. మాతో ఎమోషన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఎల్లమ్మ సినిమాను కూడా మాకే చేస్తున్నారు. అలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నాక్కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్‌ను అందులో పెట్టాల్సి ఉంటుంది. అది మా టీం చూస్తుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం తరువాత నా వద్దకు వస్తుంది. ఈ కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు ఇకపై తప్పకుండా కేటాయిస్తాను.” అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *