AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు..
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం నిర్వహణకు 4,500 కోట్లు
పశుసంవర్ధక శాఖ కు 1095.71 కోట్లు
ఉపాధి హామీ పథకం అమలుకు 5150 కోట్లు
విద్యుత్ రంగ అభివృద్ధికి ₹7241.30 కోట్లు
ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు.
మత్స్యరంగం అభివృద్ధికి 521.34 కోట్లు
పాడి పరిశ్రమ అభివృద్ధికి 133.41 కోట్లు
పంటల బీమా కోసం 1,023 కోట్లు
ప్రకృతి వైపరీత్యాలు ,ఇన్పుట్ సబ్సిడీల కోసం 8,564.37 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 108.4 కోట్ల
మార్కెటింగ్ శాఖకు 314.80 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి పథకానికి 50 కోట్లు
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.33 కోట్లు..