Vizag: విశాఖలోని కేజీహెచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్‌లో విగతజీవిగా జన్మించిన శిశువులో ఎనిమిది గంటల తర్వాత చలనం వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటలకి ఓ శిశువు చలనం లేకుండా జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించినా శిశువులో చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి సిబ్బంది రికార్డ్స్‌లో కూడా ఎంట్రీ చేసింది. శిశువు చనిపోయాడని తండ్రికి సిబ్బంది అప్పగించారు. తండ్రి శిశువును అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో శిశువులో కదలిక వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది.. శిశువుకి వైద్యం చేశారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.