TGSRTC MD VC Sajjanar: ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు . ‘రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ’ సాంగ్‌ను ఆర్టీసీ బస్సులో కళ్లు లేని ఆ యువకుడు అద్భుతంగా ఆలపించాడు. ఆ వీడియోను ఎవరో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా.. దానిని ఆయన రీపోస్ట్ చేశారు. ఆ యువకుడి టాలెంట్‌కు సజ్జనార్ ముగ్ధుడైపోయాడు. ఆయన ఆ వీడియోను పోస్ట్ చేసి.. పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని పేర్కొన్నారు. సజ్జనార్ చేసిన పోస్ట్ చాలా మంది లైక్ చేస్తున్నారు. అద్భుతంగా పాడాడని కామెంట్లు చేస్తున్నారు.