CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. “హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు” అని రీట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ బర్త్ డే విషెస్ అందరిలా కాకుండా తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్పారు. హ్యాపీ బర్త్ డే రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. దానికి కొనసాగింపుగా.. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. సర్కార్ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ రాసుకొచ్చారు. వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తానన్నారు. ఒకవేళ వాళ్లు కోరితే బర్త్‌డే కేక్ కూడా కట్ చేపిస్తానంటూ కేటీఆర్ తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది రేవంత్ రెడ్డికి అద్భుతంగా సాగాలని, ఆయన దీర్ఘాయుష్షుతో పాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.”గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు! ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజల సేవలో మీరు విజయవంతం కావాలి. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను!” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్‌లోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. శుక్రవారంతో ఆయనకు 55 ఏళ్లు. ఇక రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.