Home » PM Modi Congratulates Trump: కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్.. ట్రంప్‌కు మోడీతో పాటు అభినందనల వెల్లువ

PM Modi Congratulates Trump: కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్.. ట్రంప్‌కు మోడీతో పాటు అభినందనల వెల్లువ

Pm Modi congratulates Trump: "కంగ్రాట్స్‌ మై ఫ్రెండ్"

PM Modi Congratulates Donal Trump: : డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాకు కొత్త అధ్యక్షుడు లభించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మెజారిటీ మార్కును దాటేసి 277 సీట్లు గెలుచుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 226 సీట్లు వచ్చాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అభినందనలు తెలిపారు

డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించినందుకు ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్‌)) వేదికగా అభినందనలు తెలిపారు. “చరిత్రాత్మక ఎన్నికల విజయంపై మై ఫ్రైండ్ డోనాల్డ్‌ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. భారత్, అమెరికా సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని ఆకాంక్షించారు. రెండు దేశాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కృషి చేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.” భారతదేశం-యూఎస్ సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను. మనమందరం కలిసి మన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహిద్దాం” అని ప్రధాని పేర్కొన్నారు.

అభినందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ట్రంప్ అద్భుతమైన విజయాన్ని అభినందిస్తూ, “సెప్టెంబర్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో నా అద్భుతమైన సమావేశం నాకు గుర్తుంది, మేము ఉక్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం, విజయ ప్రణాళిక, ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును అంతం చేసే మార్గాల గురించి వివరంగా చర్చించాము.గ్లోబల్ వ్యవహారాలకు శాంతి విధానం కోసం అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను నేను అభినందిస్తున్నాను. ఉక్రెయిన్‌లో ఆచరణాత్మకంగా న్యాయమైన శాంతిని తీసుకురాగల సూత్రం ఇదే.అందరం కలిసి అమలు చేస్తామని ఆశిస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక నాయకత్వంలో బలమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క యుగం కోసం మేము ఎదురుచూస్తున్నాము. యునైటెడ్ స్టేట్స్‌లో ఉక్రెయిన్‌కు బలమైన ద్వైపాక్షిక మద్దతు కొనసాగుతుందని మేము భావిస్తున్నాము. మా రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే పరస్పర ప్రయోజనకరమైన రాజకీయ, ఆర్థిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఆసక్తిని కలిగి ఉన్నాము. ఐరోపా బలమైన సైనిక శక్తులలో ఒకటిగా, మా మిత్రదేశాల మద్దతుతో ఐరోపా, అట్లాంటిక్ కమ్యూనిటీలో దీర్ఘకాలిక శాంతి, భద్రతను నిర్ధారించడానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ను వ్యక్తిగతంగా అభినందించడానికి యునైటెడ్ స్టేట్స్‌తో ఉక్రెయిన్ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించడానికి నేను ఎదురుచూస్తున్నాను.” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అభినందనలు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన అభినందన సందేశంలో.. “అధ్యక్షుడు ట్రంప్‌కు అభినందనలు. నాలుగేళ్ల పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మరింత విశ్వాసంతో శాంతి, శ్రేయస్సు కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా.” అంటూ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. .

అభినందించిన ఇటలీ ప్రధాని మెలోని
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ట్రంప్‌ను అభినందించడంలో వెనుకడుగు వేయలేదు. అమెరికా, ఇటలీలను ‘సోదర’ దేశాలుగా అభివర్ణిస్తూ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నా తరపున, నా ప్రభుత్వం తరపున హృదయపూర్వక అభినందనలు అని ఆమె అన్నారు. రెండు దేశాలు విడదీయరాని మైత్రి, ఉమ్మడి విలువలు, చారిత్రక స్నేహంతో కట్టుబడి ఉన్నాయన్నారు.

బెంజమిన్ నెతన్యాహు కూడా అభినందనలు తెలిపారు..
ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభినందనలు తెలిపారు. పోస్ట్‌ను పంచుకుంటూ.. “ప్రియమైన డొనాల్డ్, మెలానియా ట్రంప్, చరిత్రలో అతిపెద్ద పునరాగమనానికి అభినందనలు” అని రాశారు! వైట్ హౌస్‌కి మీ చారిత్రాత్మకమైన పునరాగమనం అమెరికాకు కొత్త ప్రారంభాన్ని అందిస్తుంది. ట్రంప్‌ గెలుపు ఇజ్రాయెల్, అమెరికాల మధ్య గొప్ప కూటమికి శక్తివంతమైన రీకమిట్‌మెంట్‌ను అందిస్తుందని అన్నారు.

స్పెయిన్ ప్రధాని అభినందనలు తెలిపారు..

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. “డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన మీ విజయానికి అభినందనలు” అని రాశారు. “మేము మా వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలు, బలమైన అట్లాంటిక్ భాగస్వామ్యానికి పని చేస్తాము.” అని పేర్కొన్నారు.

అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్

డొనాల్డ్ ట్రంప్ విజయంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా అభినందనలు తెలిపారు. తన అభినందన సందేశాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్‌ రూపంలో పంచుకుంటూ.. “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయానికి అభినందనలు” అని రాశారు. ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు మంచి స్నేహితులు, నిజమైన మిత్రులు. కలిసి పని చేయడం ద్వారా, మన దేశాలు, ప్రజల మధ్య భాగస్వామ్యం భవిష్యత్తులో బలంగా ఉండేలా చూసుకోవచ్చని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *