MLA Mandula Samuel: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల పరిధిలో చౌళ్లరామారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్నాలకు 500 రూపాయల బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని అమ్ముకోవాలని వెల్లడించారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మందులు సామేలు పేర్కొన్నారు.