Home » ‘లక్కీ భాస్కర్’ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘లక్కీ భాస్కర్’ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

Producer NagaVamsi: 'లక్కీ భాస్కర్' సక్సెస్‌పై సంతోషం

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే కమర్షియల్ చిత్రం  ‘లక్కీ భాస్కర్’.

ఓ వైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూ మరోవైపు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమ నిర్మాణ సంస్థల్లో ఒకటైన    సితార ఎంటర్టైన్మెంట్స్… ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ మరో వైవిధ్యమైన చిత్రం “లక్కీ భాస్కర్”తో అలరించడానికి సిద్ధమవుతోంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. చౌదరి కథానాయిక.   సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ  , సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల  కానున్న ఈ చిత్రం తెలుగులో ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 30 సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

 లక్కీ భాస్కర్ సినిమాపై విడుదలకు ముందే ఇంత ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం ఆనందంగా ఉంది.కొన్ని సినిమాలు నాకు మంచి సినిమా చేశానన్న తృప్తిని ఇస్తాయి.  ‘లక్కీ భాస్కర్’  అంత సంతృప్తినిచ్చింది.ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది.అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం.ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో షోల సంఖ్యను కూడా పెంచాం.

– సినిమా బాగా వస్తుందనే ఆశతో ప్రీమియర్ షోలు వేస్తున్నాం.టాక్ బాగా వస్తే రేపు సినిమా చూసే వారి సంఖ్య పెరిగి ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

–  సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొందరితో మంచి రిలేషన్ ఉంటుంది.ఆ రిలేషన్ తో సినిమా జర్నీ కొనసాగుతుంది.దర్శకుడిగా వెంకీ అట్లూరిని నమ్ముకున్నాం.అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాం.

 డబ్బు సంపాదన కోసం ఎంతవరకైనా వెళ్లే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బ్యాంక్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. కొత్త ప్రపంచంలోకి వెళ్లడం లాంటిది. సినిమా మొదలైన 10 నుంచి 15 నిమిషాల్లోనే భాస్కర్ పాత్రతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. భాస్కర్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

– సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు.భాస్కర్ పాత్రలో సాధారణ అభిమానులు తమను తాము చూస్తారు.సినిమాలో హీరో ఎవరినీ మోసం చేయడు.తన తెలివితేటలతో ఎదుగుతాడు.

– ఇది న్యూస్ ఫిల్మ్ కాదు.తెలుగులో ఇదొక డిఫరెంట్ మూవీ.కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ లాంటివి కావు.ఫైట్స్ లేకుండా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది.సినిమా చూశాక ప్రేక్షకులు మంచి ఫీలింగ్స్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.

ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా పట్ల అంత సంతృప్తి చెందలేదని, నవీన్ సినిమాను బాగా చూడమని కోరారు. నాకు, త్రివిక్రమ్ గారికి సినిమా బాగా నచ్చింది కాబట్టి సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

–  మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.లక్కీ భాస్కర్ ను చూసి మీ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోండి.ఈ దీపావళికి విడుదలైన మిగతా సినిమాలన్నింటికీ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *