HYDRA: ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్లు సహకారం అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్దమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలకువలను హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు.
ట్రాఫిక్ రద్దీ, ఇతర ముఖ్యమైన సమయాల్లో పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవలకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమౌతున్నారు. వర్షాలు, వరదలు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా నిర్ణయం తీసుకుంది. త్వరలో ముఖ్యమైన కూడళ్లలో విధులు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు నిర్వహించనున్నారు.