Pushpa 2 Prerelease: హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. నెల రోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఐదుగురికి మించి గుడికూడితే చర్యలు ఉంటాయని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సమావేశాలకు తావులేదని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు కూడా అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పెద్ద చిక్కొచ్చి పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వకుంటే పుష్ప ఈవెంట్ కు ఛాన్స్ లేదంటే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ చిత్రం ఎంతో ప్రెస్టీజియస్ మూవీ. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ రాబోతున్నాడు. అంతటి హైప్ ఉన్న సినిమా ఈవెంట్ మిస్ అవ్వకూడదంటే ఒక ఆప్షన్ మాత్రం ఉంది. అదే ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఈవెంట్ చేసుకుంటే అనుమతులు చాలా సింపుల్ గా వచ్చేస్తాయి. మరి చిత్రబృందం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. పుష్ప-2 మూవీ భారీ హైపతో డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది.