Nayanthara: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీమణుల ప్లాస్టిక్ సర్జరీపై చర్చ సాగుతోంది. ఈ గాసిప్స్ పై అందాల భామలు తాము ఈ సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తున్నారు. తాజాగా లేడీ బాస్ నయనతార కూడా ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలపై తీవ్రంగా ఖండించింది. తన ఫేస్ ను మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని వెల్లడించింది. ఈ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది.
హీరోయిన్ నయనతార మాట్లాడుతూ.. “నా కనుబొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎల్లప్పుడూ వాటి ఆకారాన్ని మారుస్తాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్కు ముందు నేను వాటిని మారుస్తాను. వాటి కోసం నేను ఎక్కువ సమయం గడుపుతాను. నేను నా కనుబొమ్మల ఆకృతిని మార్చినప్పుడల్లా, నా ముఖం మారుతుంది, అందుకే బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకుని ఉండవచ్చు. వాళ్లు అనుకున్నది మాత్రం నిజం కాదు. నేను ఎప్పుడూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. అలాగే నా డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కూడా కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి కూడా చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు.” అని ఓ ఇంటర్వ్యూలో నయనతార చెప్పుకొచ్చింది.
2003లో మలయాళ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నయనతార.. కొన్ని చిత్రాల్లో చాలా సన్నగా కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం మొదలైంది. తాజాగా నయనతార ఇంటర్వ్యూలో ఆ రూమర్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ అందాలభామ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.