Home » Suryapet: కీడు వచ్చిందని వార్డును విడిచి వెళ్లిన కాలనీ వాసులు

Suryapet: కీడు వచ్చిందని వార్డును విడిచి వెళ్లిన కాలనీ వాసులు

సూర్యాపేటలో కీడు భయం: కాలనీ వాసులు వార్డును విడిచివేత

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీడు వచ్చిందని కాలనీవాసులంతా కాలనీని విడిచిపెట్టిన ఘటన ఆదివారం జరిగింది. కీడువచ్చిందని మొత్తం కాలనీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆదివారం సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డ జనాలు ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. వరుసగా ఐదుగురి మరణాలతో కాలనీకి కీడు వచ్చిందని జమ్మిగడ్డ వాసులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కీడు వచ్చిందని.. ఒక రోజు ఇంటిని విడిచి వెళ్లాలని పుకార్లు రావడంతో కాలనీలోని వాళ్లంతా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు జమ్మిగడ్డ వాసులంతా ఆదివారం(నేడు) ఒక రోజు ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో కాలనీ అంతా నిర్మానుష్యంగా మారింది. ఆదివారం జమ్మిగడ్డను ఖాళీ చేసి కాలనీవాసులు విడిదికి వెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *