Hyderabad Metro: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
*మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1. నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ మార్గాల్లో ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది.
*రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు
*ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై నిర్ణయం
- ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం
*ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించింది.
*2022 జులై 1కు సంబంధించిన ఒక డీఏ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగతా నాలుగు డీఎలు విడతల వారిగా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ త్వరలో క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
*గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం అమలుకానుంది. రహదారుల నిర్మాణ పనులకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హామ్) అమలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్ర్చర్ ప్రాజెక్టులకు ఇదే విధానం అమలవుతోంది. కేబినెట్‌కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.
గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆర్థిక విధి విధానాల ఖరారే తరువాయిగా ఉంది.