Home » Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య లేదని.. దమ్ముంటే చేసిన అసంబద్ధ ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించాలని జగన్ రెడ్డికి మండిపల్లి సవాల్ విసిరారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధితో ముందుకు వెళ్తుంది. గ్రామ సీమల్లో వెలుగులు నింపేందుకు పల్లె పండుగ చేపట్టాం. గ్రామాల్లో సీసీరోడ్లు,వీధి దీపాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. పింఛన్లు, ఉచిత ఇసుక, డీఎస్సీతో పాటు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి అసంబద్ధ వ్యాఖ్యాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో లా&అర్డర్ లేనట్లు మాట్లాడుతున్నాడు. గత ఐదేళ్ల పాలనలో 2లక్షలమంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి.. ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశారు. నాడు జగన్ కు ఈ లా&ఆర్డర్ గుర్తుకు రాలేదా? నాడు నీచమైన పాలనను సహించలేకే.. ప్రజలు వైసీపీకి డిపాజిట్ కూడా ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛలేదు.. మహిళలను జగన్ రెడ్డి గౌరవించి ఉంటే నేడు ఈ గతి పట్టేది కాదు.

గత పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. ఎక్కడ చూసినా గొడవలే.. నేడు ఆ పరిస్థితి లేదు. గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే … ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఎన్నో కవ్వింపు చర్యలు దిగారు.. అయినా నారా లోకేష్ ఎక్కడా అధైర్య పడకుండా ముందుకు వెళ్లి మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు. ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో లోకేష్ ఎన్నో ఉద్యోగాలు కల్పించాడు. గ్రామాల్లో 25 వేల కిలోమీటర్లకుపైగా సీసీరోడ్లు వేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేశాడు. నేడు అనతికాలంలోనే వైజాగ్ లో టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీని తీసుకు వచ్చారు. దాని వలన దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. లోకేష్ బాబు నిరంతరం ప్రజలకోసం పనిచేస్తున్నారు. జగన్ రెడ్డికి మతిచెడి మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒకవైపు కార్యకర్తలకోసం, మరోవైపు ప్రభుత్వానికి చేయూతనిస్తూ లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ల వలనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. ఈ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి సాధ్యం కాదు. పుంగనూరు, గుంటూరు, బద్వెల్ ఘటనలపై సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. ఈ ఘనలకు టీడీపీ కార్యకర్తలకు సంబంధంలేదు. నింధితులను వెంటనే అరెస్ట్ చేశాం.. వారికి కఠిన శిక్షపడేలా చేశాం. దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలి. ప్రజా సంక్షేమమే కూటిమి ప్రభుత్వ లక్ష్యం.” అని మండిపల్లి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *