Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా భార్య అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న రాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత అల్లుడు మల్లేశం పరారయ్యాడు. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా అల్లుడు మల్లేశం పని చేస్తున్నాడు. ఐదు రోజులుగా పోలీసులు మల్లేశంని రహస్య ప్రదేశంలో దాచిపెట్టారని మృతుడి భార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన