BSNL 5G: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 2025 జూన్ నుంచి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. వచ్చే ఏడాది మే 2025 నాటికి ప్రభుత్వం 1 లక్ష బేస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందన్నారు. దీని తర్వాత కంపెనీ జూన్ 2025 నాటికి 5G సేవకు మారుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 5జీ, 4జీ విషయంలో ప్రపంచంతో సమానంగా భారత్ అనుసరించిందని యూఎస్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో మంత్రి అన్నారు. అలాగే 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు.
మరే ఇతర ప్రభుత్వ కంపెనీల పరికరాలను వినియోగించరాదని ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత స్పష్టంగా ఉందని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5G, 6G నెట్‌వర్క్‌లలో చైనీస్ పరికరాలు ఉపయోగించబడుతున్నాయని తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ప్రవేశాన్ని ప్రభుత్వం నిషేధించింది. పూర్తిగా పనిచేసే కోర్, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ని కలిగి ఉన్నామని ఆయన చెప్పారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో లక్ష సైట్లు ఏర్పాటు చేసేందుకు మా వైపు నుంచి ప్రణాళిక సిద్ధమైందన్నారు. బీఎస్‌ఎన్ఎల్ తన సొంత 4G నెట్‌వర్క్‌ను నినియోగిస్తోందన్నారు. ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిందన్నారు. ఈ 4జీ నెట్‌వర్క్ జూన్ 2025 నాటికి 5జీకి మార్చబడుతుందన్నాపు. ఇలా చేయడంలో ప్రపంచంలోనే ఆరో దేశంగా నిలుస్తామని సింధియా తెలిపారు.
బీఎస్ఎన్‌ఎల్ 4జీ సేవను అమలు చేయడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని c-DOT, ఐటీ కంపెనీ టీసీఎస్ సహాయం తీసుకోబడిందని కేంద్ర మంత్రి తెలిపారు. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు అని, కానీ దాని విలువ మూడు పైసలకు చేరిందని మంత్రి తెలిపారు. వాయిస్ ధర 96 శాతం తగ్గిందన్నారు. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేదని, దాని విలువ ప్రస్తుం గణనీయంగా పడిపోయిందన్నారు. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. 5జీ సేవలు అందించడంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ అడుగులు వేసిందని, 22 నెలల్లోనే 4.5 లక్షల టవర్లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దేశ జనాభాలో 80 శాతం మందిని నెట్‌వర్క్ కవరేజీలోకి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 6 కోట్లు ఉండగా, ప్రస్తుతం 94 కోట్లకు చేరాయని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.