Election Schedule: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. నామినేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 29 కాగా.. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.
*మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్
*మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్
*మహారాష్ట్రలో నవంబర్ 23న కౌంటింగ్
జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.
*జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
*జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్
*జార్ఖండ్‌లో నవంబర్ 23న ఫలితాలు
మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలల్లో 288 నియోజకవర్గాలు ఉన్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. వీటిలో 234 జనరల్, ఎస్టీ నియోజకవర్గాలు 25, ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉన్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26, 2024తో ముగుస్తుంది. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 1.85 కోట్ల మంది యువ ఓటర్లు, అందులో 20.93 లక్షల మంది తొలిసారిగా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 52,789 స్థానాల్లో మొత్తం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.
“జార్ఖండ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 24; మొత్తం అసెంబ్లీలు 81, వీటిలో జనరల్ 44, 28 ఎస్టీలు, 9 ఎస్సీలు… జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగుస్తుంది. జార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, అందులో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్ల, పురుష 1.31 కోట్ల పురుష ఓటర్లు ఉన్నారు.’’ అని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.