India-Canada: భారత్, కెనడా మధ్య సంబంధాలు మరోసారి క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది. కెనడాలోని భారత రాయబారిని భారత్ సోమవారం పిలిపించింది. దీని తరువాత, కెనడా నుండి హైకమిషనర్‌ను వెనక్కి పిలవాలని భారతదేశం నిర్ణయించింది. కెనడా ఇటీవలే సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన విచారణకు భారత హైకమిషనర్‌ను లింక్ చేసింది. కెనడా ప్రకటన అసంబద్ధమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. నిజ్జార్ కేసులో కెనడా ఇప్పటికే భారత్‌పై ఆరోపణలు చేసింది. గతేడాది కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ కెనడాకు భారత ప్రభుత్వం గట్టి సందేశం ఇచ్చింది. నిజ్జార్ కేసులో కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. అదే సమయంలో భారత హైకమిషనర్‌పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. కెనడా నుండి భారత హైకమిషనర్ వైదొలగడం అంటే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ముగింపు పలకడమే.
తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం యొక్క చర్యలు భారత హైకమిషనర్ భద్రతను ప్రమాదంలో పడేశాయి. వారి భద్రతకు భరోసా కల్పించడంలో ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వం నిబద్ధతపై మాకు విశ్వాసం లేదని అందుకే వెనక్కి పిలిపిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. హైకమిషనర్‌తో పాటు మిగిలిన దౌత్య సిబ్బంది ఇండియాకు తిరిగి వస్తున్నారు. భారతదేశం, కెనడా మధ్య దౌత్య సంబంధాలలో సోమవారం ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. నిజ్జర్ హత్య కేసులో భారత అధికారులను అనుమానితులుగా పేర్కొనడంపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్కడి భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత్‌లో నివసిస్తున్న కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్‌కు కూడా భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలను అనుమానిత జాబితాలో చేర్చినట్లు కెనడా దౌత్యవేత్తకు స్పష్టం చేసింది.