Home » Baba Siddique: బాబా సిద్ధిఖీని ఎలా చంపారు…? నేరస్థులకు ఎంత చెల్లించారు?

Baba Siddique: బాబా సిద్ధిఖీని ఎలా చంపారు…? నేరస్థులకు ఎంత చెల్లించారు?

Baba Siddique's murder: నేరస్థులకు ఎంత చెల్లించారు?

Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ (66) గత రాత్రి (అక్టోబర్ 12) ముంబైలోని బండారా ఈస్ట్‌లో కాల్చి చంపబడ్డారు. బాబా సిద్ధిఖీనిని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. నిన్న కాల్చి చంపబడిన బాబా సిద్ధిఖీ అజిత్ పవార్ వర్గానికి చెందినవాడు కాగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ పవార్, అజిత్ పవార్ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. అజిత్ పవార్ బీజేపీ కూటమిలో, శరద్ పవార్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. శివసేన-బీజెపీ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.

Baba Siddique's murder: నేరస్థులకు ఎంత చెల్లించారు?
Baba Siddique’s murder: నేరస్థులకు ఎంత చెల్లించారు?

ముగ్గురితో కూడిన ముఠా బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపింది. వెంటనే లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో వ్యక్తి పరారయ్యాడు. నివేదికల ప్రకారం, వారు లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ముగ్గురు నేరగాళ్లు కలిసి బాబా సిద్ధిఖీపై ఆరు బుల్లెట్లు ప్రయోగించారు. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీ ఛాతీకి తగిలాయి. ఇద్దరు నిందితులు హర్యానాకు చెందిన 23 ఏళ్ల గుర్మైల్ బల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల ధర్మరాజ్ రాజేష్ కైషబ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శివ గౌతమ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అలాగే, ముంబై పోలీసులు హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసుల నుండి అరెస్టయిన ఇద్దరి గురించి సమాచారాన్ని కోరారు.

భారీ రక్తస్రావం
రాత్రి 9.30 గంటలకు బాబా సిద్ధిఖీని లీలావతి ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. సిద్ధిఖీకి పల్స్, గుండె చప్పుడు, రక్తపోటు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి ఇంటెన్సివ్ కేర్ అందించారు. కానీ రాత్రి 11.47 గంటలకు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఉదయం 6 గంటలకు కూపర్ ఆసుపత్రికి తరలించి అక్కడ శవపరీక్ష నిర్వహించారు.

నేరస్థుల స్కెచ్
నివేదికల ప్రకారం, హత్య ఘటనలో పాల్గొన్న ముగ్గురు నేరస్థులకు 15 రోజుల క్రితం తుపాకీలతో సహా ఆయుధాలు కొరియర్ ద్వారా పంపబడ్డాయి. ఈ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు గత 25-30 రోజులుగా కుర్ల ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ నెలకు రూ.14 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశం, బాబా సిద్ధిఖీ ఇల్లు, ఆఫీసులో ముందస్తుగా సోదాలు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలియజేశారు. నివేదికల ప్రకారం, బాబా సిద్ధిఖీని చంపడానికి ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్కరు రూ.50,000 అడ్వాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. ముగ్గురు నిందితులు నిన్న రాత్రి ఆటో రిక్షాలో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ స్థలంలో చాలాసేపు వేచి ఉన్నారు. బాబా సిద్ధిఖీ ఆచూకీ గురించి బయటి నుంచి వచ్చిన మరో వ్యక్తి వారికి సమాచారం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *