TGPSC Group 1 Hall TIcket 2024: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
TGPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడమేలా?
హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి తోడు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్లో 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించవద్దని తెలిపింది. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టబడిన సంగతి తెలిసిందే.
*గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) – అక్టోబర్ 21, 2024 పేపర్ 1(జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024 పేపర్ 2(చరిత్ర, సంస్కృతి, భూగోళ శాస్త్రం) – అక్టోబర్ 23, 2024 పేపర్ 3(ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24, 2024 పేపర్ 4(ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25, 2024 పేపర్ 5(సైన్స్&టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్) -అక్టోబర్ 26, 2024 పేపర్ 6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27, 2024 |