Ratan Tata Passes Away: ప్రముఖ వ్యాపార వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(86) తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయాన్ని వ్యాపారవేత్త హర్ష గోయంకా ట్వీట్ చేశారు. వ్యాపారం ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన దిగ్గజం ఇక లేరని పేర్కొన్నారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఇదిలా ఉండగా.. రతన్ టాటా మరణాన్ని టాటా గ్రూప్స్ గానీ ఆస్పత్రి వర్గాలు గానీ ఇంకా ధ్రువీకరించలేదు. రతన్ టాటా మార్చి 1991లో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2012లో పదవీ విరమణ చేశారు.
రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా ఈ చేదు నిజాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా..”గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ ఇక లేరు. రతన్ టాటా సమర్ధత, నాయకత్వం, దాతృత్వం విషయంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాల్లో ఎప్పటీకి నిలిచి ఉంటారు. ఓం శాంతి” అంటూ హర్ష గోయెంకా ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
Read Also: