Home » డొనాల్డ్ ట్రంప్: మోదీని ఉద్దేశించి ప్రశంసల వెల్లువ

డొనాల్డ్ ట్రంప్: మోదీని ఉద్దేశించి ప్రశంసల వెల్లువ

డొనాల్డ్ ట్రంప్: మోదీని ఉద్దేశించి ప్రశంసల వెల్లువ

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక డిబేట్ లో తన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోడీని గుర్తు చేస్తూ మోడీ ప్రధాని అయిన తరువాతే భారతదేశం సుస్థిర అభివృద్ధి జరిగింది అని ప్రశంసించారు.

ప్రధాని మోదీపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం:
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. మోడీ మంచి స్నేహితుడు అని మంచి వ్యక్తి అని ఆయన ప్రశంసించారు. ప్రధాని మోడీని ‘టోటల్ కిల్లర్’గా అభివర్ణించిన ట్రంప్, మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భారతదేశం చాలా అస్థిరంగా ఉందని అన్నారు.

డొనాల్డ్ ట్రంప్: మోదీని ఉద్దేశించి ప్రశంసల వెల్లువ
డొనాల్డ్ ట్రంప్: మోదీని ఉద్దేశించి ప్రశంసల వెల్లువ

పాడ్ కాస్ట్ ప్రసంగం
ఆండ్రూ షుల్జ్, ఆకాశ్ సింగ్ లు నిర్వహించిన పాడ్ కాస్ట్ లో ట్రంప్ మాట్లాడారు. మోదీ తనకు మంచి మిత్రుడని, మంచి మనిషి అని కొనియాడారు. ఆయన ప్రధానిగా నియమితులు కాకముందు భారత్ చాలా అస్థిరంగా ఉండేది.అతను చాలా మంచివాడు, టోటల్ కిల్లర్’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

2019లో టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన చారిత్రాత్మక ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ (నరేంద్ర మోడీ) అమెరికా వెళ్లారు, అక్కడ ఎన్ఆర్జి స్టేడియంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు, దీనికి అప్పటి అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యారు. ‘టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం ఒక అద్భుతంగా జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 80 వేల మంది హాజరయ్యారు.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *